ఒకే తల్లి కడుపులో రెండు వేరు వేరు జీవితాలు by Mahanthi Ramaraju

 ఒక తల్లి కడుపులో ఇద్దరు పిల్లలు ఉన్నారు.


సోమా
ఎల్లప్పుడూ తననుతాను ఏదోవిధంగా ఎదో పనిలో నిమగ్నమై ఉంటాడు,
రామా శాంతితో, మౌనంగా, ప్రశాంతమైన స్థితిలో ఉంటాడు. ఒకరోజు, సోమా, రామాని అడిగారు: "డెలివరీ తర్వాత జీవితంపై నీకు నమ్మకం ఉందా?" రామా ఇలా సమాధానమిస్తాడు: “డెలివరీ తర్వాత ఏదో ఒకటి ఉండాలి. బహుశా మనం డెలివరీ తరువాత ఏమి అవుతామో దాని కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నామెమో అని అనిపిస్తుంది. సోమా: "కొంచెమైనా నీకు బుద్ధి ఉందా ఆ జీవితం ఎలా ఉంటుంది?" "డెలివరీ తర్వాత జీవితం లేదు ఏమి లేదు". రామా : "నాకు తెలియదు, కానీ ఇక్కడ (కడుపులో) కంటే ఎక్కువ వెలుగు ఉంటుందని భావిస్తున్నాను. బహుశా మనం మన కాళ్ళతో నడుస్తామేమో మరి నోటితో తింటామెమో." సోమా: “నీ ఊహకు అంతేలేదా, నడుస్తామంటా... నోటితో తింటావంటా... ఎదో అయ్యిందిరా నీకు. నడక అసాధ్యం, ఎందుకంటే కాళ్ళు చూడు ఎంత లేతగా ఉన్నాయో. ఇంకేమిఅన్నవు నోటితో తింటావా? ఒరేయ్ జోకులు బాగా పేల్చుతున్నావు కామెడీగా. మనకి ఇక్కడ బొడ్డుతాడు లేకపోతె ఆహారానికి దిక్కేలేదు. డెలివరీ తర్వాత ఊహించడానికి భయంగా ఉంది హు. రామా : "ఇక్కడ కంటే భిన్నంగా ఏదో జీవితం ఉండవచ్చని అనుకుంటున్నాను అలాగే తినడానికి కూడా బొడ్డుతాడు అవసరం లేకపోవచ్చు" సోమా: “ఒరేయ్, ఒక్క విషయం చెప్పు, డెలివరీ తరువాత జీవితం ఉంటె ఇప్పటివరకు డెలివరీ అయిన వాళ్ళు ఎవ్వరుకూడా తిరిగి వచ్చారా...? అంటె డెలివరీ అనేది మన జీవితానికి ఎండ్ కార్డు రా నాయనా. నాకు తెలిసి డెలివరీ తర్వాత చీకటి, ఆందోళన, భయం తప్పా ఇంకేమి ఉండదు. రామా : "చూడు, మనకి బొడ్డుతాడు ద్వారా ఆహరం ఎవరు అందిస్తున్నారు చెప్పు, ఖచ్చితంగా మన అమ్మే అనిపిస్తుంది. మనం మన అమ్మని చూస్తామనిపిస్తుంది." సోమా: "హు అమ్మా?!" నీవు అమ్మని నమ్ముతావారా? ఒకవేళ ఆమెగానీ ఉంటె ఇప్పుడు ఎక్కడుంది?" రామా : “ఆమె మన చుట్టూనే ఉంది. ఆమెలోనే మనం జీవిస్తున్నామెమో. ఆమె లేకుంటే ఈ ప్రపంచం ఉండదు.” సోమా: "నేను ఆమెను చూడలేదు, కాబట్టి ఆమె ఉందనేది నమ్మశక్యంగాలేదు." రామా : “నేను కూడా చూడలేదు, కానీ కొన్నిసార్లు నేను మౌనంగా ఉన్నప్పుడు ఆమె గొంతులో నుండి మన మీద ప్రేమతో పిలుస్తున్నట్లు ఉంది, జాగర్తగా గమనిస్తే ఆమెను పసిగట్టవచ్చు. డెలివరీ తర్వాత ఒక భౌతికమైన జీవితం ఉందని నేను నమ్ముతున్నాను. ఆ భౌతికజీవితం కోసం మమ్మల్ని అమ్మే సిద్ధం సిద్ధం చేస్తుందని అనిపిస్తుంది." సోమా: సరే నీవు చెప్పింది నిజమే అనుకుందాం, మనిద్దరం ఒకేచోట ఉన్నాము, కానీ, నీకు అనిపించింది, నాకెందుకు అనిపించటం లేదు. రామా : దానికి కొంత ఆంతరంగిక మౌనం అవసరం. సోమా: అంటే ? రామా : మనసుని అటుఇటు పరిగెత్తించాక, స్థిరంగా ఉంచి, జరుగుతున్నా వాటితో గమనించడం. సోమా: అలా చేస్తే నాకు అర్ధమవుతుందా.. రామా : ప్రయత్నించి చూడు. ప్రశాంతంగా ఉండు, ఎంత లోతుగా ప్రశాంతంగా ఉండగలవో ఉండు, ... గమనించు... నీ చుట్టూ ఏమి జరుగుతుందో... అలాగే, నీలో ఏమి జరుగుతుందో గమనించు కేవలం సాక్షిగా... వీలైనంతసేపు మౌనంగా ఉండు."


మిత్రులారా! చనిపోవడం కూడా మన జీవితానికి అంతం కాదు, ఇంకొక ఆరంభం
--- Mahanthi Ramaraju

... ఇంకా ఉంది ...

Connect us: Facebook | YouTube | Instagram | Website

Comments

  1. చాలా చక్కగా కొత్త పంథాలో సత్యాన్ని తెలియపరిచారు. ధన్యవాదాలు సర్ 🙏🙂

    ReplyDelete

Post a Comment