రామ, భీమ అనే ఇద్దరు స్నేహితులు ఏడో తరగతి చదువుతున్నారు.
రామ చదువులో ఎప్పుడూ ముందుంటాడు, అయితే భీమ ఆటలలో చురుకుగా ఉంటాడు. అందరూ భీమను మెచ్చుకుంటూ, చదువు మీద కూడా శ్రద్ధ పెడితే భవిష్యత్తు బాగుంటుందని చెబుతారు. భీమ ఆ మాటలను పట్టించుకోడు.
రామ, భీమ మార్పు చెందాలని నిర్ణయించుకుంటాడు. అతను భీమతో మాట్లాడుతూ, "మనకు పరీక్షలు దగ్గరపడ్డాయి. కలిసి చదువుకుందాం. నీకు సాయం చేస్తాను," అని చెప్పాడు.
భీమ స్పందిస్తూ, "నేను ఆటల్లో బాగున్నాను. నువ్వు చదువులో బాగున్నావు. అంతే! నా పనిలో నువ్వు చెప్పే అవసరం లేదు," అని చెబుతాడు.
భీమ ఛాలెంజ్‌గా, "నన్ను పరుగు పందెంలో ఓడిస్తే నీ మాట వింటాను," అని చెబుతాడు. రామ భీమ చెప్పిన మాటపై ఏమీ చెప్పకుండా ఉండిపోయి, ప్రతి రోజు పరుగు పందెం కోసం సాధన చేయడం మొదలుపెడ్తాడు.
Oka Roju రామ భీమ వద్దకు వచ్చి, "నిన్ను ఓడిస్తే, చదువుతావు కదా!" అని అడుగుతాడు. ఇద్దరూ పరుగు పందెంలో పాల్గొంటారు. చివరికి రామ గెలుస్తాడు.
భీమ ఆశ్చర్యపడి రామను అడుగుతాడు, "నువ్వు చదువులో ముందుంటావు సరే, పరుగు పందెంలో ఎలా గెలిచావు?"
రామ సమాధానమిస్తూ, "సాధనతో ఏదైనా సాధ్యమే. నేను ప్రతిరోజూ ప్రాక్టీస్ చేశాను. అలాగే నువ్వు చదవడం మీద శ్రద్ధ పెడితే మంచి మార్కులు సాధించవచ్చు," అని చెబుతాడు.
రామ చెప్పిన మాటలకు భీమ గౌరవం ఇచ్చి, అప్పటి నుంచి ఆటలతో పాటు చదువుపై కూడా శ్రద్ధ పెడతాడు. తన ఆటలతో పాటు మంచి మార్కులు సాధిస్తూ తన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తాడు.

Comments
Post a Comment