అయస్కాంత క్షేత్రాలు - Ramaraju Mahanthi

ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడి శరీరం చుట్టూ ఎథిరిక్ పొరల రూపంలో అయస్కాంత వలయాలు చుట్టి ముట్టి ఉంటాయని శాస్త్రజ్ఞుల తెలియజేస్తున్నారు. ఈ అయస్కాంత శక్తి వలయాలనే మనం "దేహకాంతి వలయాలు", లేదా "ఆరా" అని అంటాం. 

ఈ వలయాలు ఏవీ కూడా సాధారణంగా కంటికి కనిపించవు. కానీ మన దేహం చుట్టూ ఒక కోడి గుడ్డు ఆకారంలో ఏర్పడి శరీరానికి అన్ని వైపులా దాదాపు మూడు మీటర్ల వరకు విస్తరించి ఉంటాయి.

మన శరీర నిర్వహణకు పునాదిగా నిలిచే ఈ అయస్కాంత శక్తి వలయాలు మనలో చెలరేగే భావోద్వేగాలనూ, ఆలోచనలనూ మరి దృక్పధాలనూ ప్రభావితం చేస్తూ అవి సరియైన రీతిలో ప్రకటిత మయ్యేలా సహాయం చేస్తూ ఉంటాయి.

ఒకానొక వ్యక్తి భావనాపరంగా, శరీరపరంగా మరి మానసిక పరంగా ఎప్పుడయితే ప్రకృతి చట్టాలను గౌరవించడం మొదలు పెడతాడో .. అప్పుడే ఈ అయస్కాంత క్షేత్రాలు .. ఆయా చట్టాల నిర్వహణలో అతడికి సహాయం చేయడం మొదలుపెడతాయి. ఆ వ్యక్తి శరీర అవయవాలను సంరక్షిస్తూ చక్కటి రోగనిరోధక శక్తితో కూడిన ఆరోగ్యాన్ని అతడికి అందిస్తాయి. అద్భుతమైన స్పష్టతా శక్తిని కలిగి ఉండే ఈ అయస్కాంత క్షేత్రాలు అనుకోని పరిస్థితులలో మన శరీరం అస్వస్థతకు గురి అయినా కూడా .. వెంటనే ఆ అస్వస్థతలను సరిచేసి శరీరం ఆరోగ్యకరంగా ఉండంలో ఎంతో సహాయం చేస్తాయి

చాలా మందికి ఈ అయస్కాంత క్షేత్రాల గురించి అవగాహన లేకపోవడంతో వాటి పట్ల పెద్దగా ఆసక్తి కనబరచరు. అయినా కూడా ఆ వ్యక్తి యొక్క మనుగడ మాత్రం అతడి చుట్టూ ఉండే అయిస్కాంత క్షేత్రాల నిర్వహణ మీదే ఆధారపడి ఉంటుంది!

మన శరీరాలలో ఈ అయస్కాంత క్షేత్రాలు సాధారణంగా మనం ప్రతి రోజు పొందే సూర్య శక్తి నుంచి సంగ్రహించబడతాయి. సూర్యకాంతి నుంచి మనం పొందే శక్తి ముందుగా తల భాగంలోకి ప్రవేశించి అక్కడి నుంచి  శరీరం అంతా విస్తరిస్తూ శరీర కణాలలో నిక్షిప్తమై పోతుంది. ఆ శక్తి నిల్వల వల్ల మన శరీరంలోని అయస్కాంత క్షేత్రాలు మరింత పటిష్టంగా మారి మనం కూడా ఈ సృష్టిలో చిన్న చిన్న "సూర్యకాంతి గోళాలు"గా రూపుదిద్దుకుంటాం.

మనం ఆధ్యాత్మిక విలువల పట్ల అనైతికంగా ఉన్నప్పుడు మన శరీరంలోని అయస్కాంత శక్తి ప్రవాహంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి. దానివల్ల మన జీవితగమనం అస్తవ్యస్తం అయిపోతుంది. అందుకే మన ప్రాపంచిక జీవితం సవ్యంగా సాగాలన్నా మరి ఆధ్యాత్మిక జీవితం ఉన్నతంగా  ఉండాలన్నా మనం ప్రకృతి సూత్రాల పట్ల అత్యంత అంకితభావంతో ఉండాలి. భయాలు, భావోద్వేగాలు, అధికార దుర్వినియోగాలు మరి అణిచివేత ధోరణులూ మనలో తలెత్తకుండా చూసుకోవాలి. లేకపోతే ఇవన్నీ కూడా మనలోని అయస్కాంత శక్తి క్షేత్రాలను ప్రభావితం చేస్తూ మనలోని శక్తి నిలువలును హరించి పోయేలా చేస్తాయి. దానివల్ల మనం మంచి-చెడుల మధ్య ఉండే విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాము.

పటిష్టవంతంగా రూపుదిద్దుకుని ఉండే మన శరీరంలో అయస్కాంత క్షేత్రాలు మనం నకారాత్మక ధోరణితో ఆలోచిస్తున్నప్పుడూ .. అహంకారంతో ప్రవర్తిస్తున్నప్పుడూ .. మరి ఆరోగ్యకరమైన జీవన విధానాలను ధిక్కరిస్తూ ఉన్నప్పుడూ .. జరగబోయే అనర్థాల పట్ల మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. మానవ మనుగడకు మనం ప్రశ్నార్థకం కాకుండా కాపాడుతూ ఉంటాయి. ఈ అయస్కాంత క్షేత్రాలు పటిష్టంగా ఉన్నప్పుడు మన శరీరంలోని తమదైన ప్రత్యేక అయస్కాంత క్షేత్రాలను కలిగి ఉండే కోటానుకోట్ల కణాలు ప్రకృతి సూత్రాల అమలు పట్ల తమదైన బాధ్యతను ప్రదర్శిస్తూ ఉంటాయి. అప్పుడే మన శరీరంలో ఉండే జీర్ణకోశ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, నాడీమండల వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, మూత్రపిండాల వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, మరి వినాళ గ్రంథుల స్రావక వ్యవస్థ అన్నీ కూడా ఒకదానితో మరొకటి సమన్వయం చెందుతూ పని చేస్తూ ఉంటాయి.

ఇందులో ఏ ఒక్క వ్యవస్థ యొక్క అయస్కాంత క్షేత్రం నకారాత్మక శక్తులతో నిండిపోయినా సరే .. ఆ వ్యవస్థలోని శక్తి నిలువలు తగ్గిపోయి .. దాని ప్రభావం ఇతర వ్యవస్థలపై పడుతుంది. అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క శరీరం చుట్టూ వలయాలుగా విస్తరించి ఉండే ఈ అయస్కాంత దేహకాంతి క్షేత్రాలు తమ పరిధిలోకి వచ్చే ఇతర దేహకాంతి క్షేత్రాలను కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకే, ఒక కుటుంబంలో కానీ, ఒక సమాజంలో కానీ, ఒక వ్యక్తి శరీరంలోని అయస్కాంత క్షేత్రాలలో లోపం ఏర్పడినప్పుడు .. దాని ప్రభావం ఆ కుటుంబం మొత్తం మీద లేదా ఆ సమాజం మొత్తం మీద పడుతుంది. దానివల్ల కుటుంబం లేదా సమాజం అంతా అల్లకల్లోలం కావడం లేదా .. అనారోగ్యాల బారిన పడడం లేదా సామూహిక డిప్రెషన్ల బారిన పడడం జరుగుతుంది! 

ఒక్కోసారి "ఏ దుష్ట శక్తో సమస్త మానవాళి మీద దాడి చేస్తోంది" అని కూడా అనిపించవచ్చు. 

ఫలితం ఏదైనా .. అందుకు కారణం మాత్రం " ఆ కుటుంబం లేదా ఆ సమాజంలో ఉన్న ఏదో ఒక వ్యక్తి శరీరంలో ఏర్పడిన అయస్కాంత క్షేత్రాలలోని అసమతుల్యత యొక్క ప్రభావమే అది" అని మనం గ్రహించాలి.

అలా గ్రహించి .. ఆ వ్యక్తిని సరిచేసి .. ఆ కుటుంబ పునరుద్ధరణకు లేదా ఆ సమాజ పునరుద్ధరణకు పూనుకోవాలి. తద్వారా మరింత హాని జరగకుండా కాపాడుకోవాలి.

* * *

మనిషి ఈ భూమి మీద జన్మ తీసుకొని కొంతకాలం జీవించి .. చివరికి చనిపోయేంత వరకు ప్రతిక్షణం మనిషి శరీరం వివిధ రకాలుగా పరిణామం చెందినట్లు .. మనిషిలోని అయస్కాంత క్షేత్రాలు కూడా నిరంతరం పరిణామం చెందుతూనే ఉంటాయి. అలా అభివృద్ధి చెందుతూనే విశ్వ మూల చైతన్యంగా పరిణమించడానికి అవి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఇందుకు గాను .. ఆ మనిషికి ఒక జన్మ పట్టవచ్చు లేదా అనేక జన్మలు పట్టవచ్చు. కానీ ప్రతి జన్మలో కూడా ఆయా శక్తి క్షేత్రాలలో ఎంతో కొంత పరిణితి మరి ఎంతో కొంత అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది.

ఎంతగా వీరిలోని అయస్కాంత క్షేత్రాలు పరిణితి చెందుతూ ఉంటాయో .. అంతగా వాళ్ళు ఇతరుల శక్తి క్షేత్రాలతో అనుసంధానం అవుతూ ఒక సామూహిక శక్తిగా మారి ఈ మహావిశ్వంలోని ఇతర లోకాలపై కూడా తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు.

ఇదంతా కూడా ఒకానొక ముఖ్య కేంద్రం నుంచి వెలువడే టీవీ లేదా రేడియో ప్రసారాలు కాంతి తరంగాల నెట్ వర్క్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెలివిజన్ లలో ప్రసారమైనట్లు ఉంటుంది. ఇందులో టెలివిజన్ బ్రాడ్ కాస్టింగ్ స్టూడియోలు ఆ శక్తి యొక్క మూల స్థానాలు అయితే .. కోట్లాదిగా ఉండే టెలివిజన్ పరికరాలు ఆ మూల శక్తిని బయటకు వ్యక్తీకరించే పరికరాలుగా భావించవచ్చు!

విశ్వం కూడా సజీవమైనదే .. అది కేవలం పరమాణువులతో నిండిన శూన్యం కాదు. నిజానికి శూన్యం అన్నది కూడా తన యొక్క మూల చైతన్యంతో సూర్య శక్తిని కూడా ప్రభావితం చెయగలుగుతుంది. కనుక ఆ విశాల విశ్వంలో భాగాలమైన మనం మన మాటలు, మన ఆలోచనలు మరి మన చేష్టలతో, మన ఆయస్కాంత క్షేత్రాలను ఎలా ప్రభావితం చేస్తున్నామో ప్రతిక్షణం గమనించాలి. విశ్వ సమాఖ్యలో సభ్యులుగా విశ్వం పట్ల మన వారసత్వాన్ని గుర్తించి విశ్వన్యాయాలను గౌరవించాలి.

మన సమాజంలో పాతుకుపోయి ఉన్న మాదక ద్రవ్యాలు, వ్యాపార ధోరణులు, సాటి మనుషులను మరి జంతువులను వినియోగ వస్తువులుగా పరిగణించే దుష్ట సాంప్రదాయాలు ఎలా సమస్త విశ్వాన్ని కలుషితం చేస్తున్నాయో గుర్తించి వాటి నిర్మూలనకు కృషి చేయాలి.

ఇలాంటి నైతిక చర్యలన్నీ కూడా కీలకమైన శక్తులుగా మారి మన వ్యక్తిగత ఆయస్కాంత క్షేత్రాలను బలోపితం చేయడమే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజం యొక్క సామూహిక అయస్కాంత క్షేత్రాలను కూడా బలోపేతం చేస్తాయి. ఇలాంటి బలమైన సమూహాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నతమైన నాగరికతలు వెల్లివిరిస్తూ .. అక్కడ ప్రజలంతా విలువలతో కూడిన జీవితాలను జీవిస్తూ ఉంటారు.

ఎప్పుడైతే భూకక్ష్య యొక్క అయస్కాంత క్షేత్రంలో నకారాత్మక పరిస్థితులు ఏర్పడతాయో, దానిని సరిదిద్దడానికి అనుభవజ్ఞులైన మాస్టర్లు భూమిమీద జన్మించి ఆ నకారాత్మతలను సరిదిద్దుతూ ఉంటారు. అలాంటి వాళ్ళే బుద్ధా, జీసస్, మొహమ్మద్, ఆదిశంకరాచార్య, ఓషో రజనీష్ అలాగే మన ప్రియతమ గురువు, సకల ప్రాణికోటి కళ్యాణ మిత్రుడు మన పత్రిగారు. 

ముందు గురువుగారు చిన్న చిన్న సజ్జన సాంగత్యాలతో మొదలుపెట్టిన ఈ అయస్కాంత క్షేత్రాలు, నెమ్మదిగా పౌర్ణమి ధ్యానాలుగా మారి, ధ్యాన సప్తాహాలుగా, 40 రోజుల మండల ధ్యాన శిబిరాలుగా పట్టణాలలోనూ, మారుమూల గ్రామాలలో సైతం నిరంతరం నిర్వహించి, లెక్కకు మించిన చిన్న చిన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాల రూపంలో ఈ అయస్కాంత క్షేత్రాలు స్థాపించడం జరిగింది.

దీనితో బొట్టు బొట్టు కలిసి మహా ప్రళయంగా మారినట్టు, ఈ చిన్ని చిన్ని ఈ అయస్కాంత క్షేత్రాలు అంతా కలిసి పెద్ద పెద్ద అయస్కాంత క్షేత్రాలు గా ధ్వానమహాయజ్ఞాలుగా, అత్యంత వైభవోపేతంగా వేలాది మందితో నిర్వహించుకోవడం జరిగింది. ఆ తరువాత "ధ్యాన మహా చక్రాలు" గా, "మహిళా ధ్యాన మహా చక్రంలుగా", మరి "పత్రీజీ ధ్యాన మహా యాగాలుగా" మనం జరుపుకున్నాము.

దీనివలన భూకక్ష్యలోని అయస్కాంత క్షేత్రాలలో సకారవంతమైన మార్పులు జరిగి కొన్ని కోట్ల జీవరాశులు రక్షింపబడి, కొన్ని కోట్ల మనుషుల జీవితాలలో ధ్యాన వెలుగులు నింపి మనకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే ... ముందు ముందు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వచ్చే సంచికలో చూద్దాం... అంతవరకూ ఈ భూమి మీద జరిగే అతిపెద్ద అయస్కాంత క్షేత్ర సమూహాల సమాహారమే ... డిసెంబర్ 21 నుండి 31 వరకు జరిగే "పత్రీజీ ధ్యాన మహా యాగం". అందులో పాల్గొని మన అయస్కాంత క్షేత్రాలను అభివృద్ధి పరచుకొని లోక కల్యాణంలో భాగస్వాములం అవుదాం!



Comments